Header Banner

ఏపీలో ఈ కొత్త పథకం గురించి తెలుసా..! రూ.20 కడితే రూ.2లక్షలు.. దరఖాస్తు చేస్కోండి!

  Fri May 09, 2025 10:07        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద కార్మికుల కోసం పెద్ద మనసుతో మంచి నిర్ణయం తీసుకుంది. ఉపాధి హమీ కార్మికులు ప్రమాదాల్లో చనిపోతుండటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఉపాధి హామీ కార్మికులకు బీమా పథకాలు వర్తింపజేయాలని నిర్ణయించింది. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వతంగా వికలాంగులైనా పరిహారం పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న రూ.50 వేల పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచగా.. తల్లిదండ్రులతో పాటు వచ్చే ఆరేళ్లలోపు పిల్లలకు కూడా పరిహారం పెంచింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ బీమా పథకాలు అమలు చేసినా..చాలా కొద్దిమంది మాత్రమే వాటిని ఉపయోగించుకున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం అందరికీ బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. దీని కోసం కార్మికులందరూ బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా తెరిచి.. ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఈ బీమా పథకం ఉంటే.. దురదృష్టవశాత్తు మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆర్థికంగా సాయం అందుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాలను అమలు చేయనుంది. సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రతి కార్మికుడికి లబ్ధి చేకూరుతుంది. జీవనజ్యోతి బీమా యోజన పథకం కుటుంబంలో పెద్దకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ కుటుంబ పెద్ద చనిపోతే, రెండు పథకాల ద్వారా కలిపి రూ.4 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అదే సురక్ష బీమా యోజనకు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

దీనికి ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే.. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు పరిహారం ఇస్తారు. పాక్షిక వైకల్యానికి రూ.లక్ష చెల్లిస్తారు. జీవనజ్యోతి బీమా యోజనకు 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. దీనికి ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ మరణిస్తే రూ.2 లక్షల పరిహారం అందిస్తారు. ఈ బీమాల విషయాన్ని గమనించి ఉపాధి హామీ కార్మికులందరూ ఈ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ కార్మికుల బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రామికుల దినోత్సవంలో ప్రకటించారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన శ్రామికులకు ఇస్తున్న పరిహారం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టులో భారీ ఉద్యోగాలు! మెట్రిక్ నుంచి డిగ్రీ అర్హతతో.. ఇక ఆలస్యం చేయొద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovt #InsuranceScheme #WorkersWelfare #PMSBY #PMJJBY #EmploymentGuarantee